STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Tragedy Classics

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Tragedy Classics

మనసు జతవై!

మనసు జతవై!

1 min
314

మనసు జతవై!


ఎడారిలా తడారిన నా కళ్ళల్లో ఓ వర్షపు చినుకై కురుస్తావా 

నిశీధి గోడలమధ్య నిర్మానుష్యంగా మారిన మనుసులోకి 

ఓ కాంతిపుంజమై వస్తావా 


ప్రేమకాంక్షతో హోరెత్తే హృదయంలో నిశ్శబ్దగీతానివై వినిపిస్తావా

కలలు అలలుగా ఎగిసిపడుతున్న సమయాన

కనురెప్పలమీద నీ ప్రేమసంతకం చేసెళ్తావా


దిగులు నన్ను కమ్మేసిన ఒంటరి సమయాన నాకోసం రెండు చిరునవ్వులు మోసుకొస్తావా

మరణం నా దరిచేరిన వేళ నీ ప్రేమ ఆయువు నిచ్చి 

నాలో కొత్త జీవం పోస్తావా..


కలకాలం నా మనసు జతవై, నా నీడవై నా వెంటే పయనిస్తావా..


శ్రీలత.కె 

హృదయస్పందన



Rate this content
Log in

Similar telugu poem from Romance