STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Tragedy Action

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Tragedy Action

నా ప్రేమ..!

నా ప్రేమ..!

1 min
303

గుండెల్లో భూకంపం వచ్చిందేమో

పగిలిపోతున్న బాధ

మనసుని సునామి ముంచిందేమో

లోలోతుకి కుంగిపోతున్న బాధ

కళ్ళ నుండి కుంభవృష్టి కురిసిందేమో

ఎరులై పారుతున్న వరద ఆగిపోని బాధ

శరీరం మీద పిడుగు ఏదో పడిందేమో

తనువు భూమిపై కూలిపోతున్న బాధ.

 నేను నిలువునా రాలిపోతున్న బాధ..

అయినా నీ మీద ప్రేమ మాత్రం

బతికే ఉంది ఎందుకో...?

శ్రీలత.కె

హృదయస్పందన 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance