STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Tragedy Action Inspirational

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Tragedy Action Inspirational

ఆడపిల్ల కాదు నేను ఈడ పిల్లని!!

ఆడపిల్ల కాదు నేను ఈడ పిల్లని!!

1 min
341


 మీరు జన్మ ఇస్తారు, చదివిస్తారు,

కట్నకానుకలు, లాంచనాలు ఇచ్చి

 ఆడపిల్ల అంటే ఆడ ఉండాల్సిన పిల్ల 

ఈడ ఉండే పిల్ల కాదు అని

 పెళ్లి చేసి పంపిస్తారు.


అంతటితో ఆగుతారా..?

నాకు కడుపొస్తే దవాఖాన్ల మీరె చూపించాలి

నాకు పిల్లలు పుడితే కానుపు చేయాలి, వాల్ల బారసాల చెయాలి, వాల్ల పుట్టినరోజు, ఒకటా రెండ వాళ్ళ పెండ్లి అయేదాకా మీరు కట్నాలు, కానుకలు పెట్టాలి.


మరి ఈడ నేను ఉరికే తిని కూసోని సినిమాల హీరోయిన్ లెక్క సుఖపడుతున్ననా అంటే అట్ల లేకపోయే.. ఇంట్ల పని చేయాలె, నౌకరి చేయాలె.

చేసుకున్నోడు పనికిమాలినోడు అయితే వాన్ని నేనే సాదాలే.. నేను ఎంత సదివిన, ఎంత పెద్ద నౌకరి చేసిన వాళ్ళ ముందు కూసోవద్దు..


ఇది చాలదన్నట్టు 

పెళ్లి అయింది మొదలు అత్త, మామ,

ఆడబిడ్డలు, వాళ్ళ బిడ్డలు అని నువు బయపడాలే

నేను బయపడాలే. వాళ్ళ ఇంట్ల పండుగలు, పబ్భాలు అయితే నువు చేయాలె, నేను చేయాలి 

చీరలని, సారెలని నువు పెట్టాలె,

 నేను పెట్టాలె పెట్టకుంటే కొట్లాటలు.


ఇదంతా కాదు కానీ నాకో డౌట్

నేనే కట్నాలు తీసుకుపోయి పెళ్లి చేసుకోవాలె

నేనే వాళ్లకి సేవలు చేయాలె,

నేనే సంపాదించి వాళ్లకి పెట్టాలె

మల్ల నేనే వాళ్లకి భయపడాలి 

ఎవరు పెట్టిండ్రు ఈ పాడు సాంప్రదాయం..


ఆడ బిడ్డ ఆడ కాదు ఈడ ఉండాలే నాతో

నా తల్లితండ్రులని గౌరవించే వాళ్ళు కావాలి

ఈ పాడు కట్నాలు, పనికిమాలిన కట్టుబాట్ల నుండి ఆడపిల్లలు విముక్తి పొందాలి..


శ్రీలత.కొట్టె

హృదయస్పందన©️✍️

28-03-2023

7:00pm


Rate this content
Log in

Similar telugu poem from Tragedy