కలగన్నానేమో నీకై..!!
కలగన్నానేమో నీకై..!!
ఓయ్...
పెదవుల మాటున మాటలన్నీ దాచానేమో నీకై
మనసుని తాకిన ఆశలన్నీ అరేసానేమో నీలో
కన్నులకాంతినంత నింపేసానేమో నీ మోములో
నీపైపు వేస్తున్న అడుగుల సడి వినిపిస్తుందా
నీకై దాచిన కలలు అలలై ఎగిసే ఆరాటం కనిపిస్తుందా
నీతో సావాసం కోసం వేచిన హృదయపు స్పందన తెలుస్తుందా
ఏమి రాయలేక రాలిపోతున్న అక్షరాలను అడుగు
ఎమి దాయలేక ఒలికిస్తున
్న కాసిన్ని మాటలను అడుగు
ఎటుపారిపోనివ్వని కాలాన్ని అడుగు ప్రేమ అంటే ఏమిటో!
కాసిన్ని చిరునవ్వులు చిలకరిస్తావా పువ్వే పుస్తాను
కొన్ని మాటలు అడ్డెస్తావా ఆలోచనల ప్రవాహానికి
ఒక్క వాక్యం రాసిస్తావా నా సమాధి శిల్పం మీద ముద్రించటానికి
ఎప్పుడో ఒకసారి కలగన్నానేమో నీకై.. నేనుగా..
నీ.. నేనుగా..
శ్రీలత. కె
హృదయస్పందన