STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Classics Inspirational Children

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Classics Inspirational Children

నాన్న నువ్వే నా హీరో!

నాన్న నువ్వే నా హీరో!

1 min
409

నాన్న నువ్వే నా హీరో!

మొన్నటి నా బాల్యం నీ బుజాల మీద

నిన్నటి నా చదువు నీ రెక్కల కష్టం మీద

నేటి నా జీవితం నీ త్యాగాల ఫలితం.


నాన్న నీతో నేను గడిపిన క్షణాలు ఎన్నో

నా రూపం అమ్మది అయినా అలవాట్లు మాత్రం నీవే అంటే ఎంత ఆనందంగా ఉంటుంది.

ఆడపిల్లలు అమ్మకు పనుల్లో సాయం చేస్తే

నేను మాత్రం నీతోనే పొలం దగ్గరికి ఒచ్చేదాన్ని.

అమ్మాయి కి ఈ పనులు ఎందుకు అని

అందరు నిన్ను అంటుంటే...


తను నాకు కూతురు కాదు కొడుకు

కూతురు కొడుకుగా బాధ్యత తీసుకోగలదు

కానీ కొడుకు ఎప్పుడు కూతురిలా ప్రేమించలేడు

అని నువు అన్నప్పుడు ఎంత గర్వంగా ఉండేది.

అవును నాన్న నేనే నీకు అన్నీ....

నాలో ప్రాణం ఉన్నంతవరకు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇస్తున్న...


నాకు జీవితం విలువ నేర్పించిన గురువువి

మంచితనానికి మారు పేరు నువ్వు

మానవత్వానికి పరాకాష్ట నీ నడత..

కష్టాలకు కుంగిపోకుండా

ఎలా ఎదురు నిలబడి పోరాడాలో 

నీ నుండే కదా నేను నేర్చుకుంది.


నా జీవితం అనే ప్రయాణం లో నువు ఎప్పుడు నాకు మార్గదర్శిలా వెన్నంటే ఉండి నన్ను నడిపిస్తావు.

నాన్న నువ్వే నా బలం.. నువ్వే నా హీరో..!!


శ్రీలత.కె

హృదయస్పందన


Rate this content
Log in

Similar telugu poem from Classics