STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Classics

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Classics

కొత్త ప్రపంచం!

కొత్త ప్రపంచం!

1 min
324


ఓయ్ నా కంటిపాప కన్వాస్ పై

నీ చిత్తరువు చిత్రించాను

రెప్పలు వాలిన ప్రతీసారి

 నీ మోమును ముద్దాడాలని..


నా కలంలో నా శ్వాసనే సిరాగా నింపాను.

అది లిఖించే భావాలన్నీ

నీ హృదయాన్ని చేరి

నీకు కొత్త ఊపిరి పోయాలని..


నా చిలిపి ధరహాసపు ఆధారాలని

తేనేతీయదనంలో ముంచి నీకై అందిస్తున్న.

ఆ అధరచుంబణం అమృతదారై

నీ మనసుని తడపాలని..

నీలో ప్రేమకు అమరత్వాన్ని ఇవ్వాలనీ..


నా అంతరంగలో దాగిన అనంతమైన ప్రేమను

నీ గుండె వాకిట్లో చుక్కల ముగ్గుల్లా వేసివచ్చాను

ఆ నక్షత్రకాంతుల్లో నీ గుండెగుడి శాశ్వతంగా వెలిగిపోవాలని..


ఓయ్ నిన్నే ఒక్క అవకాశం ఇస్తావా

నీకోసం మరో ప్రపంచాన్ని సృష్టిస్తాను..

నాలోని నిన్ను నీ మనసుకి చూపిస్తాను.

నీలో లేని నాకోసం ఎంతకాలమైనా నిరీక్షిస్తాను. 


నీకై ప్రతీ ఉదయం కొత్తగా స్పందించే 

ఓ హృదయస్పందన.


శ్రీలత. కె

హృదయస్పందన.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance