STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Action Classics Inspirational

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Action Classics Inspirational

జీవితం!!

జీవితం!!

1 min
258

జీవితం అంటే..

గెలువు - ఓటముల కోసం ఆరాటం కాదు

చావు - బతుకుల మధ్య బతుకు పోరాటం

నువు వెళ్లే దారిలో పూలతో పాటు

ముళ్ళు కూడా ఉంటాయి.

అన్నింటిని దాటుకొని సాగిపో..


పొగిడే వాళ్ళు పొగడిని

తిట్టేవాళ్ళు తిట్టని

నవ్వే వాళ్ళు నవ్వని

ప్రేమించే వాళ్ళు ప్రేమించని

ద్వేషించే వాళ్ళు ద్వేషించని,


అన్నింటిని స్వీకరిస్తూ..

అలుపు సొలుపు లేకుండా

ఆకలి నిద్ర మరచి

సాగిపో విజయతీరం చేరేదాకా..


నేడు నిన్ను చూసి నవ్వినవాళ్లే

నీ విజయాన్ని చూసి నోళ్లు మూతపడేలా,

నిన్ను అవమానించిన వాళ్ళు ఆశ్చర్యపడేలా..

నువు వెస్ట్ అన్న, ఎందుకు పనికిరావు అన్నా అన్నిటికి ఒకటే సమాధానం చిరునవ్వు పంచుతూ సాగిపో..


అవమానలను ఆశీర్వాదాలుగా

అవహేళనలను అభివృద్ధి సోపానాలుగా

మలుచుకొని ముందుకు సాగిపో...


ఆత్మవిశ్వాసానికి అహంకారానికి తేడా తెలియని వాళ్ళముందు నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.

అవమానాలు, అవహేళనలే నీ గెలుపుకి పునాదులు

అని నమ్ముతూ.. అంగీకరిస్తూ..


గెలుపు అంటే డబ్బులు సంపాదించటం - పేరు సంపాదించటం కాదు నలుగురి హృదయాల్లో స్థానం సంపాదించటం.

కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసి హృదయం ద్రవించటం,

ఆనాధలను చూసి అక్కున చేర్చుకోవటం.

అన్యాయం జరిగితే ప్రశ్నించడం అదే నీ గెలుపు.


నీ గమ్యం, నీ లక్ష్యం నీ దారి నీకంటూ ఉంది

ఆ దారిలోనే సాగిపో...

మానవతామూర్తిగా నిలిచిపో...

అదే నీ గమ్యం..అదే నీ లక్ష్యం..


శ్రీలత.కె 

హృదయస్పందన.


Rate this content
Log in

Similar telugu poem from Action