STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

శ్రీ గురు నీతి కవిత - కవీశ్వర శతకం . added. on 13.03.2022

శ్రీ గురు నీతి కవిత - కవీశ్వర శతకం . added. on 13.03.2022

2 mins
444

శ్రీ గురు నీతి కవిత - కవీశ్వర శతకం .

         “శ్రీ పరమ గురుభ్యోనమ:”

జ్ఞాన లక్ష్మి, గణేశ్ , శివ, రామ కృష్ణా ది దేవతల శుభాశీస్సులతో    

  గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దే వో మహేశ్వర

  గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః ||

 జ్ఞానానంద మయం దేవం నిర్మల స్పాటికాకృతిం

 ఆధారం సర్వవిద్యనామ్ హయగ్రీవ ముపాస్మహే ||

పూజ్యాయ రాఘవేంద్రయ సత్య ధర్మ రతాయచ

భజతాం కల్ప వృక్షాయ నమతాం కామ ధేనవే ||

శ్రీ గురుభ్యోనమ: ||


    గుకారో జ్ఞానాంధకార రకారో జ్ఞాన ప్రకాశం         మకారో మహేశ్వరస్య జ్ఞాన వృద్ధి కవీశ్వరా ||1 ||

 భావం : కవీశ్వరా! గు కారంజ్ఞానాంధకారమనునిర్ములన కోసం , ర కారమ్ ప్రకాశము కలిగి , మకారం మహేశ్వరుని స్మరిస్తూ జ్ఞాన వృద్ధిని పెంపొందించుకునేందుకు సద్గురువుని అనుసరించండి. 


    అజ్ఞానం అంధకారస్య నివృత్తిమ్ సద్గురుమ్ సేవనం సుఖం          ప్రజ్ఞేన అభివృధ్యర్థం నిత్యం సాధనం కురు కవీశ్వరా || 2|| 

భావం : ఓ కవీశ్వరా! అజ్ఞానాంధరాకారాన్నినివృత్తి చేసుకోవడానికి సద్గురు సేవనం సుఖమే ఎందుకంటే ప్రజ్ఞ చే అభివృద్ధి ని పెంపొందించుకోవడానికి ప్రతిరోజు సాధనంచెయ్యాలి. 


  సదాచారం అద్వితీయం శిష్యాణీం సముపార్జయేత్ సాధనం       జీవనం సాధ్యతే సులభం తద్గురుమ్ సేవనార్థం కవీశ్వరా || 3|| 

భావం : ఓ కవీశ్వరా ! మంచి ఆచారం (సదాచారం) అద్వితీయం , శిష్యులు దానిని సముపార్జించుకొనుట కు సాధనం ద్వారా ఉత్తమమైన జీవనం ( జీవితాన్ని) సులభంగా సాధించు కోవడానికి సద్గురు సేవ చేసుకోవడం ఉత్తమమని అభిప్రాయం .


   త్రిమూర్తిం దత్తరూపానాం సూర్యం తథా జ్ఞానరశ్మి భావనం        ఆరోగ్యం సంపదాం స్వీకృతం ప్రార్థనా యోగానంతర కవీశ్వరా || 4|| 

భావం : ఓ కవీశ్వరా ! త్రిమూర్తులు దత్తరూపాలుగా ఉండి , ఆదిత్యునిగా జ్ఞానమనే కిరణాల్ని భావన మాత్రం చేత, ఆరోగ్యాన్ని, సంపదల్ని ప్రార్థన మరియు యోగానతరం స్వీకరింపజేస్తారు. అంటే త్రిమూర్తులే కాకుండా దత్తాంశలో ఉండే ఎన్నో దైవ రూపాలు మనకు ఏంతో మేలు చేస్తాయని దీనిభావం .  


  జీవనం జీవిత గమ్యం మాతృమూర్తి ప్రసాదతే ప్రథమ ఇలన్ గురున్       బాధ్యతామ్ పితృ సౌలభ్య కృత కృత్యాన్ లక్ష్య బేధానార్థం కవీశ్వరా || 5||

భావం : ఓ కవీశ్వరా! ప్రథమంగా భువిలో మాతృమూర్తి - జీవనాన్ని, జీవితాన్ని ప్రసాదిస్తుంది . గురువులాగా బాధ్యత జనకుని సౌలభ్యమునకు గతిని, గమ్యాన్ని చేరుకోవడానికి కృతకృత్యుడై , లక్ష్యబేధానార్థం వారు (మాతృమూర్తి, జనకుడు ( తండ్రి ) మరియు గురువుగారు గమ్యాన్ని సూచిస్తారు. శిష్యుడే వారు చూపించిన పథంలో పయనించి పయనించి అనుభవయోగ్యమైన లక్ష్యాన్ని చేరుకొని , జీవితాన్ని సుఖవంతముగా సాగించగలరు. 

 కే. జయంత్ కుమార్ , రాజేంద్రనగర్  11 .05 . 2020 . 

    13 . 03 . 2022 .

     ప్రకృతీ మాఆశ్ఛర్యకర విశేష సమాచారతిష్ఠతి , అపి సర్వ జనాన్ 

     జ్ఞానాన్ సముపార్జయేత్ ,గుణపాఠాన్ స్వీకరిష్యతి కవీశ్వరా || 6 ||

భావం : ఓ కవీశ్వరా ! ప్రకృతియందు ఆశ్చర్య కరమైన విశేష సమాచారములతో నిండి ఉన్నది 

అంతే కాకుండా అందరు జనులు జ్ఞానాన్ని,పాఠాలనే కాకుండా మంచి ప్రబోధించే గుణపాఠాలు కూడా తప్పక తమ జీవన శైలియందు స్వీకరిస్తే బాగుంటుంది.


    అంబుధి వలే వర్షించు జ్ఞానం,ప్రవహించు సారస్వతమువలె మేధమునందున్ 

    జ్ఞాన కాసారమునుండి జ్ఞానేంద్రియాల చే ఇత్తరి ను పయోగపరచు కవీశ్వరా || 7 ||

భావము : ఓ కవీశ్వరా ! జ్ఞానం మేఘములవలె వర్షించును ఇంకా సరస్వతి నది వలే,

సారస్వతము లాగా ఒక సరస్సు వలే ఏర్పడి ఆ సరస్సు నుండి ఈ విధముగా మన జ్ఞానేంద్రియాలచే వివిధ ప్రక్రియలచే ఆ జ్ఞానాన్ని ఉపయోగ పరచుము .

13 . 03 . 2022 . 


Rate this content
Log in

Similar telugu poem from Abstract