బాలల అల్లరల్లరి- గేయ కవిత జయంత్ కుమార్ 29 . 06 . 2023
బాలల అల్లరల్లరి- గేయ కవిత జయంత్ కుమార్ 29 . 06 . 2023
బాలల అల్లరల్లరి- గేయ కవిత
జయంత్ కుమార్ 29 . 06 . 2023
బాలలూ ,
కడవలు ఓటి నుండి జల్లులచే నిండే మొత్తము దాహము తీర్చే కడవలు
పడవలు చేసిరి బాలలు కాగితములచే చేసి విడిచిరి వాగులో పడవలు
బురదలుపెంచే తామరలు తెంచుకొని అంటించుకొనిరి బట్టలపై బురదలు
వరదలు పంచె జడివాన నల్లని మబ్బులు ఆనందంతో చూచిరి వరదలు
||కడవలు ||
గొడుగులు ఇంద్రధనువుల తలపించే చినుకులు పైన కురిసే గొడుగులు
పిడుగులు ఆనందించిరి మెరుపు మేఘమాలల చే అల్లబడ్డ పిడుగులు
బుడుగులు ఉత్సాహంతో తేలియాడిరి బుడగలచే చిందులాడిరి బుడుగులు
మడుగులు పారే అలుగులు పిల్లలు చిల్లించిరి ఆనందముతో జల మడుగులు <
/p>
|| కడవలు ||
అడుగులు అతుక్కు పోయిన పాదములు బాలలు వేసిరి కళల చే అడుగులు
తొడుగులు వేసిరి చిన్ని చేతులు తడవకుండా రక్షచేసుకొనిరి ఆ తొడుగులు.
మరకలు పట్టెను కాలి పట్టీలకు మెరుపులా వదిలించుకొనిరి పట్టీల మరకలు
పరకలు పరికించి మొలిచెను ఆలోచలనల తరగలు వెనకేసుకొనిరి పరకలు
|| కడవలు ||