STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Drama Action Inspirational

4  

Thorlapati Raju(రాజ్)

Drama Action Inspirational

భైరవా..

భైరవా..

1 min
359

శివరాత్రి శుభాాంక్షలు 🌷🌷


శంకరా! శుభంకరా !

ఈశ్వరా! పరమేశ్వరా!

లింగేశ్వరా! భువనేశ్వరా!


భైరవుడా! రుద్రుడా!

ముక్కంటుడా! త్రినేత్రుడా!

కాలకంఠుడా! గరళకంఠుడా!


నిరంజనా! నీలకంఠ!

మహాదేవా! మహాశివా!


ఓ! శివయ‌్యా!

శతాధిక నామధేయ!


ఈ జగితిన ...

జరిగేదంతయూ..నీ దయ..నీ లయ..

అని..వింటినయా!


కాని!


ఈడ సూత్తాంటే!

ఏ దయ లేకుండా..లయతప్పి..

విళయతాండవం సేసే...

లయకారులెందరో....ఉన్నారయా!


ఓ పరమేశ్వరా!


ఈ స్రృష్టంతా...

నువ్వాడే ఆటే...అని ..వింటినయ్యా!


కాని!


ఈడ ...

రాజకీయ నాయకులు ఆడే ... 

ఆట సూడాలంటే ...

నీ మూడో కన్ను కూడా...సాలదేమొనయ్యా!


అప్పటికపుడే..

నిన్ను దేవుడని లేంపలేసుకుంటా రు

అడ్డమొస్తే ... రాయవని.. లేపేస్తారు!


అబ్బబ్బా!

ఈడ జరిగే పాపాలు సూత్తాంటే!

నాకెందుకో...డౌటు కొడతాంది...శివయ్యా!


ఎక్కువ పాపాలు సేత్తే...

ఇంకా..ఎక్కువ..నిన్ను తలత్తారని!

నువ్వే..సేయిత్తున్నావా ! ఏంది!


లాభం నేదు..భైరవా!


నువు బేగ యెలిపొచ్చి....

నీ..పవరు..సూపిత్తేనే...గాని!


ఇక్కడ పవరున్నోల...పవరులు పోయి

నీ..పంచన...చేరేలా..నేరు....శివయ్యా.....!


                రాజ్........



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama