సునామీ
సునామీ
అలల సవ్వడి
పెంచింది కలల అలికిడి
రేపింది గుండెల్లో అలజడి
పరువం కలబడి
కోరిక తీర్చమంటుంది తిరగబడి
రేపు రేతిర..
నా మావ నా కాడికి వచ్చే పున్నమి రేతిర
జరగాలి ఎన్నెల్లో జాతర
సెయ్యాల మేమిద్దరం ..జాగర
జర భద్రంగా వట్టుకొచ్చే ఓ..చందర
పది దినాల కింద ఏట కెల్లిన ఓ నా.. మావ
టూనా సేపలు తెత్తున్నావా
సాలమను సేపలు ఒట్టుకొని సాల్మన్లా వత్తున్నావా
వంజరాలు పట్టుకొచ్చే నా వజ్జరాల మావ
నేక..
దీపాలామాసకి మాతరమే వచ్చే
చీరమీనులు.. ఒడిసి పట్టిన చీర పట్టుకొస్తున్నవో
గానీ.. మావా
నీకోసం పులస సేపల పులుసు సేసి
పూల మంచం సక్కగా సేసి
నీ సూపుతో సిగ్గుపడి జారిపోయే
సిలుకు సీర సుట్టుకొని
నువ్వు ముట్టుకుంటే ముడి ఊడిపోయే
p>
రైక గట్టుకొని
రేపు నువొచ్చే రేతిరి కోసం ఈ రేతిరే
నే కంటున్న మావా... ఎచ్చటి కలలు
ఏటో మావా..
ఈ రేతిరి కెరటాలు ...
ఆపసోపాలు పడుతూ తెగ ఒగురుస్తున్నాయి
ఆటి ఎత్తు పల్లాలు సూత్తా ఉంటే
నా రుదయం లో ఆయాసం...
.....
...
మావా మావా...ఇదెంది మావా
తుపానుకు సేపలు కొట్టుకొత్తున్నట్టు
కెరటాలు...కొట్టుకొచ్చెత్తున్నాయ్ మావా
మావా...మావా...ఎక్కడున్నావ్ మావా 😭
తీరం చేసిన గాయాల్లో...
జాలరుల జీవితాలు....
జలప్రళయం లో...జలమయం అయి
శోక సంద్రంలో లో...కలిసి పోయి
తమ కడుపు నింపే కడిలికి
తమ ప్రాణాలను కానుకగా ఇచ్చేస్తున్న
సాగర పుత్రులు ఎందరో...
......రాజ్ తొర్లపాటి.....