క్రొత్తవాడు
క్రొత్తవాడు


ఎంతోమంది అవుతారు పరిచితులు,
తెలిసే ముందు వారందరు అపరిచితులు |౧|
ఎన్నో యాత్రలలో ఎదురవుతాడు క్రొత్తవాడు,
తన వూరు-పేరుతో మాట్లాడటం మొదలుపెడతాడు అతడు |౨|
అనంతరం సొంత విషయాలు అడుగుతాడు అపరిచితుడు,
ఒకే భాషలో మాట్లాడితే కాస్త సంతోషంగా చెప్తాడు ఇటుపక్క అపరిచితుడు |త్రీ|
మాట్లాడగా మాట్లాడగా తినే సమయం వచ్చెను,
తన దగ్గరున్న తిను పదార్థం నూతన పరిచితులకు ఇచ్చెను |౪|
ఈ సమయమున జాగ్రత్త వహించవలెయును,
ముందు తనకు తినమని చెప్పవలెయును |౫|
ఎందుకంటే మత్తుపదార్థం తినే పదార్థంలో ఉండవచ్చును,
మైకం వచ్చినచో విలువైన సామానులు దొంగతనం ఆగును |౬|
క్రొత్తవాడి వద్ద సొంత విషయాలు అట్టే మాట్లాడరాదు,
ఎందుకంటే స్వభావం తెలియదు కనుక వాడి జోలికి వెళ్ళరాదు |౭|