STORYMIRROR

Ramesh Babu Kommineni

Drama

5.0  

Ramesh Babu Kommineni

Drama

పచ్చని పల్లె

పచ్చని పల్లె

1 min
481


ప౹౹

పలక‌రించి వద్దామా మన పల్లెను ఒకసారి

చిలకరించి చిన్ననాటి జ్ఞాపకాలే మరోసారి ౹2౹


చ౹౹

చెరువు గట్లను చెట్టు పుట్టలనూ చూసేద్దామా

బరువు భాద్యతలేని బాల్యాన్ని తడిమేద్దామా ౹2౹

వచ్చీపోయే ఆలమందలనే అదిలించివద్దామా

పచ్చీపాల కంకులను కాల్చుకొని తినేసేద్దామా ౹ప౹


చ౹౹

బంగారూ బాల్యం ఎంత అమూల్యమో తెలిసి 

కంగారూ లేని ఆ కాలాన్ని ఆమూలాగ్రం కొలిచి ౹2౹

తిరిగిరానిదని తీరుగా తేలాక చేసేదేమిలేకనూ

తరిగిపోని సృతులు తరగని సంపదలే ఇకనూ ౹ప౹


చ౹౹

చిన్ననాటి ఊరు చిక్కిపోయినే వలసలతో చూడు

ఉన్నపాటి జనం కూడ ఉండలేకను కదిలెగా నేడు ౹2౹

పచ్చని పొలాల నడుమ పరిఢవిల్లే ఆనాటీ పల్లేగా

వెచ్చని నిట్టూర్పే మిగిలే పనికిరాని పాలన వల్లేగా ౹ప౹


Rate this content
Log in

Similar telugu poem from Drama