STORYMIRROR

Malleswari Kolla

Drama Classics Others

4  

Malleswari Kolla

Drama Classics Others

నేస్తమా...

నేస్తమా...

1 min
429

నిన్ను తలవకుండా నిమిషం అయినా ఉండాలనుకుంటాను

కానీ నువ్వు వెలివేసిన మనసు నాకన్నా ముందే నిన్ను తల్చుకుంటుంది.....

నీ పేరుని అయినా మరచిపోవాలని పెదవిని మౌనంతో బంధిస్తాను

కానీ నువ్వు నిందించిన హృదయం నీ ఊసులని గుండె చప్పుడుగా మార్చుకుంది.....

నువ్వు దూరమయ్యావని కన్నీటికి తెలిసినా

నీ జ్ఞాపకాలను కమ్మని కవితలుగా కనుపాప నాకు అందించింది....

నీ స్నేహంలో నేను పొందిన ఆనందం కన్నా

నీ ప్రేమ నాకు సొంతం కాదన్న నిజం అనుక్షణం నన్ను దహిస్తోంది......

నేస్తమా.....

నిన్ను ప్రశ్నించే ధైర్యం చాలక అనుదినం నాకు నేను దూరమవుతూ బ్రతుకుతున్నా......



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama