STORYMIRROR

Malleswari Kolla

Drama Romance Others

4  

Malleswari Kolla

Drama Romance Others

జ్ఞాపకాల పూదోట

జ్ఞాపకాల పూదోట

1 min
377

ఊపిరివై జీవితమంతా నాకు తోడుగా ఉంటావనుకున్నాను.....

కానీ తుఫానుగా మారి నన్ను విడిచి వెళ్లిపోయావు......

స్పర్శవై నిలువెల్లా నన్ను తడిపేస్తావనుకున్నాను....

కానీ కలగా మారి కనుమరుగై పోయావు.....

చిరునవ్వుతో నా మనసుకు దగ్గర అవుతావనుకున్నాను....

కానీ కన్నీళ్లను నాకు తోడుగా ఇచ్చి దూరమయ్యావు.....

నీ అడుగుల సవ్వడినే నా గుండె చప్పుడు చేస్తావనుకున్నాను.....

కానీ మౌనమనే గుణపాన్ని నా గుండెల్లో గుచ్చావు.....

అయినా కూడా ఎదురు చూపులనే కలలుగా మార్చుకుని, ఆశలనే ఊపిరిగా చేసుకుని నీ జ్ఞాపకాల పూదోటలో ఒంటరిగా బ్రతికేస్తాను ప్రియా.......

                



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama