ప్రేమంటే❤️
ప్రేమంటే❤️


ప్రేమంటే ఎక్కడుందని వెతుకుతుంటాం......
కానీ మనలోనే ఉందని తెలుసుకునేది ఎప్పుడు!!
ప్రేమంటే వేరొకరు పంచేదనుకుంటాం......
కానీ మనం ఇచ్చేదని తెలుసుకునేది ఎప్పుడు!!
ప్రేమంటే మన సుఖమేననుకుంటాం......
కానీ వేరొకరి సుఖం కోరటమని తెలుసుకునేది ఎప్పుడు!!
ప్రేమంటే మన మీద చూపేదనుకుంటాం......
కానీ మనం చూపేదని తెలుసుకునేది ఎప్పుడు!!
ప్రేమంటే అర్థం కాని పదం అనుకుంటాం......
కానీ అది లేకపోతే జీవితం వ్యర్థం అని
తెలుసుకునేది ఎప్పుడు!!