నమ్మకు చెలీ.. నమ్మి మోసపోకు
నమ్మకు చెలీ.. నమ్మి మోసపోకు


అందమైన మాటలు చెప్పి.....
అరచేతిలో స్వర్గం చూపే వారిని నమ్మకు చెలీ....
అసలే నమ్మకు..
నువ్వే నా ప్రపంచం అంటారు.....
నా కళ్ళలో విహరించు స్వప్న సుందరి నీవే అంటారు.....
నమ్మకు చెలీ.....
నమ్మి మోసపోకు......
నీ కంటికి కాటుక అంటారు.....
నీ నుదిటిన సింధూరం అంటారు.....
నీ పెదవులపై చిరునవ్వు తానంటారు.....
నమ్మకు చెలీ.....
నమ్మి మోసపోకు......
తన గుండె చప్పుడు నువ్వు అంటారు.....
తన హృదయంలో నువ్వే కొలువై ఉన్నావు అంటారు...
నమ్మకు చెలీ....
నమ్మి మోసపోకు......
ముక్కుకు ముక్కెర అయ్యేంత అదృష్టం నాకు లేదా అంటారు........
కందిపోయే నీ పాదాలు నా ప్రాణం అంటారు......
నమ్మకు చెలీ.....
నమ్మి మోసపోకు.....
కన్నవారిని మైమరిపించేంత ప్రేమ నాది అంటారు.....
ఈ విశ్వంలో నీ కోసం పుట్టింది నేనే అంటారు......
నమ్మకు చెలీ.....
నమ్మి మోసపోకు.......
గత జన్మ బంధమేదో వెంటపడుతుంది అంటారు......
నిదురయినా పోనీక, కంటికి కునుకంటూ రానీక నీ ఆలోచనలతో ఊసులాడుతున్నా అని అంటారు....
నమ్మకు చెలీ....
నమ్మి మోసపోకు....
మాయ మాటలేన్నో చెప్పి.....
దేహపు దాహం తీర్చుకున్నాక నడి రోడ్డున నిన్ను విడిచి పారిపోయేవారి మాటలు నమ్మకు చెలీ....
నమ్మి మోసపోకు......
మోజు తీరాక మోసపోయినది నీవే కాదు.....
నువ్వే ప్రాణం అనుకున్న నిన్ను కన్న వారు......
మోసంతో చచ్చేది నీవే కాదు......
నువ్వు గడపలో నుండి అడుగు బయట వేసాక అవమానంతో ఏనాడో చచ్చిపోతారు నీకన్న వాళ్ళు.....
కాబట్టి చెలికాడినంటూ చెప్పే మోసపూరితమైన అనవసరపు మాటలు విని.......
నమ్మకు చెలీ......
నమ్మి మోసపోకు చెలీ....