స్వర్గం
స్వర్గం


కన్నుల కొలనులో.....
నీ కలలే కలువలుగా వికసిస్తుంటే......
స్వర తంత్రులలో....
నీ నామమే పాటగా ఆలపిస్తుంటే....
మది పొరలలో.....
నీ నవ్వులే వానగా కురుస్తుంటే....
పున్నమి వెన్నెలలో.......
నీ ఊసులే మల్లెలుగా విరబూస్తుంటే......
ఎద కోవెలలో.....
నీ రూపమే విగ్రహంగా ప్రతిష్టిస్తుంటే.....
ఇంతకు మించి జీవితానికి ఇంకేముంటుంది ఆనందం....
నీ ఒడి కాదా నాకు భూతల స్వర్గం.........