STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Drama

2  

Venkata Rama Seshu Nandagiri

Drama

తల్లి ప్రేమ

తల్లి ప్రేమ

1 min
175

మారాము చేయువాడు కాడు మా రాముడు

మీకో దండం, మా కోదండరాముని విడువండి'.

లబలబ లాడుతూ బలవంతాన తీసుకెళ్ళింది

రాముని తల్లి తమ ఊరు మునిపల్లెకు కోదండరాముని.

రాముని వలె శాంతపరుడు, పరుల జోలికి పోడని

బంగారాల బాబని గారాం చేస్తుంది ఆతని తల్లి

రాముడెంతటి కానివాడో మిత్రులకే కాని తల్లికి తెలియదు

అమాయకుని వలె కనపడే పట్టుపడని మాయకుడు

బడిలో పంతులు చెప్పినా రాముని లోపాలు తల్లి వినదు

అమె ప్రేమైక మూర్తి, బిఢ్ఢపై నమ్మకమనే మైకంలో ఉంది

అతని తండ్రికి తెలియగా గ్రహించాడు భార్యకు తెలివి లేదని

రాముడు ఏమీ తెలియని తల్లిని తెలివిగా ఏమారుస్తున్నాడని

భార్యకు తెలియచెప్పి రామునితో నిజం చెప్పించాడు

ఆమెకర్థమైంది కోదండరామునికి దండన తప్పదని

రామునికి గుణపాఠం కావాలని గ్రహించి పంపింది తిరిగి పాఠశాలకు

రాముడు తప్పును గ్రహించి ఒప్పుగా చదివి పిదప అందరి మెప్పు పొందాడు.


Rate this content
Log in

Similar telugu poem from Drama