మెరుపు తునకలు (హైకూలు)
మెరుపు తునకలు (హైకూలు)


సెలయేరు గలగలలు
సెల్ ఫోన్ గణగణలు
మొదటిది నాదం
రెండవది రోదనం
పల్లెటూరి పచ్చదనం
పరికీణల ముచ్చటితనం
జ్ఞాపకాలలో నిలిచిన బాల్యం
ఎప్పుడూ మరువని అమూల్యం
మనసు అలపులేని కోతి
మరులు పుట్టించే చుప్పనాతి
ఆశలు ఆశయాలు ఖగోళమంత
అవకాశాలు మాత్రం భూగోళపు వింత
ఆస్తులు అనువంశికం మాత్రమే
ఆచారాలు భాషలు దిగుమతి సూత్రమే
ఒకటి వద్దన్నా వరించి వదలనిది
ఒంకోటి విదిలించుకొన్నా వదిలించుకోలేనిది
కోరికలు మనసు గుర్రాలు
చెలరేగి చెరిపేసే అదుపాజ్ఞలు
కళ్ళెం విప్పిన ఆ కవ్వింత
అరిటాకుపై ముళ్ళ తుళ్ళింత
సృష్టిలో లేనిది సామ్యవాదం
సమిష్టిలో సౌఖ్యం బహు వివాదం
ఉన్నదానిని పంచుకోటానికి పోరాటం
లేనిదానికోసం ఎందుకో తెగ ఆరాటం