వచ్చింది ఒక కలలా
వచ్చింది ఒక కలలా
మెరిసే కళ్ళతో
సంపంగి పూవంటి సోకుతో
ఎంకిలా
వానా కాలం వరదలా
వచ్చింది తను ఒక కలలా
చిన్న పిల్లాడు తాయిలం కోసం చేసే మారాంలా
నా దగ్గర ఆటలాడింది
తావి కోసం తిరిగే తేనెటీగలా
నా చుట్టూ తిరిగింది
బావిలో కప్పలా ఉన్న నన్ను
బయటి ప్రపంచంలోకి తీసుకువచ్చింది
నా తప్పుల్ని సరిదిద్దింది
నన్ను నేను ప్రేమించుకునేలా చేసింది
ప్రతి కుర్రాడూ వయసులో కోరుకునే తోడులా
తను నా వలపు విహారంలో ఈడూ జోడూ అయ్యింది
నాకోసం దేవుడు సృష్టించిన జీవన భాగస్వామి
వచ్చింది నా దరికి ఒక కలలా
చేసింది నా జీవితాన్ని రంగుల కలలా