చిన్ని కన్నయ్యా!
చిన్ని కన్నయ్యా!


1. ఎందుకురా నీ అల్లరి?
నీవే నా ఊపిరి
చూడరా ఈ బొమ్మలు
ఆడరా మైమరచి // చిన్ని కన్నయ్యా//
2. నా కష్టాలు మరచా నీ నవ్వులలో
నా యిష్టాలు తరచా నీ పరవశంలో
గొప్ప భవిష్యత్తు నీదేనోయి
నిరంతరం నేనున్నానోయి //చిన్ని//
3. నీ పెరిగే వయసులో
నా తరిగే జీవనంలో
జ్ఞానామృతం అందిస్తా
ఆత్మానందం చిందిస్తా//చిన్ని//
4.నీ జీవిత సాఫల్యానికి
నేనుంటా ఆధారంగా
సాధించుకో లక్ష్యాలన్నీ
సంపాదించుకో కీర్తి కిరీటాలన్నీ//చిన్ని//