ప్రజా ప్రతినిధి
ప్రజా ప్రతినిధి


మధ , భుజ, గజ, నక్కల శైలిలో
అశేష జన సందోహంలో
గజిబిజి బాబుల వలయంలో
తరిగి ఇరిగి పోయిన జీవ ప్రాణాలు //
జీవo లేని శేవాల ప్రజా క్షేత్రంలో
జీవించి చతికిలబడ్డ జీవితాలు
మగధీరుల దలపతుల ముఠా రాజ్యంలో
ఇరుకున పడ్డ ప్రజా ప్రతినిధి వర్గాలు //
కుళ్లిన ఈ పైశాచిక లోకంలో
కబళించే కళేబరాల కాకుల కేకలతో
ధైర్య సాహసములేక జీవించే శేవ పీనుగులై
దౌర్భాగ్యపు కీచక వధ లేల తప్పకుండేనో //
మదపుటేనుగుల బల నిరూపణలో
నలిగిన నక్క జిత్తుల ప్రతినిధి సైన్ధవుడె
ఎంత ఉరిమినన్ చలించకపోయే సైoధవుల్
ప్రజాక్షేత్ర బలమా, ప్రతినిధుల బృందమా //
మోర పెట్టుకున్నా వినని రాజకీయ నిపుణులు
ప్రజలేమైన కానీ మాదే యీ రాజంబు
దీవించుమా ఓ మాత్రు హ్రుదయమా!
కరుణించి మన్నించుమా ఓ దేశభక్తి గీతామా //