వెన్నెల సందడి
వెన్నెల సందడి


నిండు పున్నమి వెన్నెల సుందర వన విహారంలో
మది సంబరపడే వేళలో
సందడి చేసే పూల గుత్తులు
ఊగిస లాడే మనసు మ్రొగ్గలై...
నిండు చందురుని వెన్నెల
మల్లెల గుబాళింపు వీచె పవన మారుతమై
కల్మషము లేని మమకారాల చూపులతో
మనసు పరిమళించె ఒక అందమైన గులాబీలా...
నిండు పున్నమి వెన్నెల సుందర వన విహారంలో
మల్లె మొగ్గలు రాలి నేల గుబాళించగా
కనుబొమ్మల చూపులో
మైమరిచా నీ ఆత్మ శ్వాసలోన...
చూసి చూసి మనసు మందగించె
చరణ గీతములా మనసు ఊగిసలాడే
దారి చూపు ఓ వెన్నెల చంద్రమ్మా
వొళ్ళు జలదరించె నీ వెన్నెల మార్గంలో...