ఆత్మ సాక్షి
ఆత్మ సాక్షి


శుభము కలిగించు
శుభ సుభోదయ సూర్యమా
శరవేగమున పయనించు
ఓ కాంతి చక్రమా //
శుభ సుభోదయ నీ కాంతి వెలుగులో
మనసులు విహరించె ఆనంద డోలికలో
మమతలు తోడై ఆడి పాడగా విహార యాత్రలో
శుభము కలిగించు సూర్య తేజమా//శుభము కలిగించు//
ఉరుములే భాజాలుగా, మెరుపులే భజంత్రీలుగా
తలంబ్రాలే వర్షపు బిందువులుగా
తలపించే మనసులే బంధాలుగా
శుభము కలిగించు ఓ సూర్యతేజమా //శుభము కలిగించు //
ఆకాశమె దేదీప్య మానమై వెలుగె
తారాలే దీవించె అక్షింత గణములై
బ్రహ్మ రుద్ర మహర్షులే ప్రార్ధించె
శుభ సుప్రభాతవేళ దీవించె జీవ ప్రాణులను సూర్యస్సాక్షిగా //శుభము కలిగించు //