మమతల భావం
మమతల భావం
నా కనుపాపలలో మెదిలే నీ రూపం
కలిసె మమతల భావంతో
మది విహరించే మమతల పల్లకీలో
నా కను రెప్పల వలయంలో
మనమిరువురం విహరిద్దామా
ఊహకి అందని లోకంలో
బ్రహ్మ లోకపు అంచులలో
చవి చూద్దామా బ్రహ్మజ్ఞానాన్ని
పారిజాత పరి మళ కుసుమాన్ని
ఇద్దామా మన జీవన తరానికి
కలలుకాని ఈ లొకంలో
మన జీవనమే ఒక అనుభూతి
మనముందామా సూర్యుడి సాక్షంతో
మనముందామా గంగానదీ తీరానా
చూద్దామా హిమగిరి సొగసులు
వెళదామా కన్యాకుమారి క్షేత్రలకు