ఎదలోమది
ఎదలోమది


ఓ మనసా నను చూడుమా!
మదిలో మమతలూరగా
తనువే పులకిరించగా
వయసే పలుకరించె //ఓ మనసా //
వయసే చిగురించె
చిరు జల్లులు తోడై
మేఘమే మెరిసే
ఇంద్ర ధనుస్సు కాంతిలో//ఓ మనసా //
మదిలో మెదిలే గీతాల భావం
భావమె తలపించె సరాగాలు
భావాల సరసమే కలిపె బంధమై
మనువే మైమరిచే చెలిమితో //ఓ మనసా //
జన జీవనమే జీవమై
బ్రతుకె బహు ముఖ ప్రజ్ఞయై
మమతలే మధురానుభూతులై
జనరంజకంగా మెరిసే //ఓ మనసా//