కాలమె కాటేస్తే
కాలమె కాటేస్తే
కాలమే కాటేస్తే - కోపమే తాపమై
కాలంతో జగడం - లోకంతో పబ్బం
శాపాల పాపినై - దారిద్ర బంధంలో
నను నేనె మరిచా- ఈ కష్టాల మైకంలో //
ఇంతేరా లోకము - ఇదేరా జీవనము //
అపస్వర రాగము
అపార్థాల లోకము
తూర్పున ఉదయించే సూర్యుడు
పడమట వెలుగొందే చంద్రుడు // కాలమే కాటేస్తే //
కలలోని కావ్యమా - కాషాయ లోకమా
భువిలోని మనిషికి - మతిచెదిరే భాష్యము
ఓ గారాల కాలమా - నీవింత కఠినమా
నయనాల శున్యము - ఈ లోకమంతా భారము//
కాలమే కాటేస్తే //
<
br>
మణులున్న సంద్రమా
నీకెందుకింత ద్వేషము
శ్వాసున్న జీవము
ఓ సుకుమార ప్రాణము // కాలమే కాటేస్తే //
కాలం చెల్లె ఈ లోకంలో - మనుగడ లేని ఈ జీవం
నమ్మించే ఓ కాలమా - మోసమే నీ నైజమా
జాలిలేని కాలమా - ఎందుకింత శాపము
చివరకు కాటిలోన బూడిదాయె దేహము // కాలమే కాటేస్తే //
ఎందుకురా ఈ ఆరాటాము
ఇంతేరా జీవితం
మోసపోయిన జీవి
గాలిలొ కలిసే ప్రాణం // కాలమే కాటేస్తే //
ఇంతేరా జీవితం
ఇదేరా లోకము // కాలమే కాటేస్తే //