STORYMIRROR

VENKATALAKSHMI N

Tragedy Inspirational Others

4  

VENKATALAKSHMI N

Tragedy Inspirational Others

నిజమైన స్వేచ్ఛ కావాలి

నిజమైన స్వేచ్ఛ కావాలి

1 min
187

బోసినవ్వుల బాపూజీ

తెల్లదొరల తుపాకీలకు ఎదురొడ్డి స్వేచ్ఛను మాకిచ్చావు

నేడు ఆ స్వేచ్ఛ కాలుష్యకోరల్లో చిక్కి నలుగుతున్నది

శాంతి అహింసలనే ఆయుధాలతో బ్రిటీషు గుండెలను గడగడలాడించావు

నేడు అశాంతి వలయం ఆవహించి అడుగడుగున దహిస్తున్నది

రాట్నం వడికి ఖద్దరు నేసి స్వదేశీ వస్త్రంతో హుందాగా నడిపించిన దేశం

నేడు విదేశీ వస్తు వ్యామోహంలో విలవిలలాడుతున్నది

నిరాడంబరతతో నలుగురికీ ఆదర్శంగా నిలచి ఓర్పు సహనమనే ఆభరణాలతో వెలుగు పంచావు

నేడు సహనం దహనమై అరాచకం అకృత్యమై అల్లాడుతున్న జనం

పదవీ వ్యామోహం ధనదాహం తెలియని నీ నిర్మలమనసు నీ సత్యవాక్కు నిస్వార్థం సుగుణాలు

నేడు మచ్చుకైనా కానరాని మానవత్వం అబద్దాల నీలి నీడల్లో మంటగలిసింది

అంతులేని అరాచకాలకు అంతం లేకుండా పోతుంది

అనంతవాయువుల్లో స్వేచ్ఛాగీతం ఆవిరైపోతున్నది

గాడితప్పి గతి తప్పుతున్నది ఆదర్శం

రాజకీయరంగు పులుముకున్నది సర్వత్రా దేశం

నువ్వు మళ్ళీ జన్మించి గతి తప్పిన దేశాన్ని బాగుచేసి

మంచిని మానవత్వాన్ని బతికించవూ

భరతమాతకు నిజమైన స్వేచ్ఛస్వాతంత్ర్యాలను ప్రసాదించవూ


Rate this content
Log in

Similar telugu poem from Tragedy