ఆమె ఇల్లు
ఆమె ఇల్లు


ఇదేం పెంకితనం పనులు రా... ఇంకో ఇంటికి వెళ్లాల్సిన పిల్లవి.... అమ్మా నాన్నా మందలింపు
ఇదేం పని అసలు...మీ ఇంట్లో ఇదే నేర్పారా.... అత్తా మామ హుంకరింపు
మీ ఇంటి మూట ఏమి లేదు ఇక్కడ... ఊరికే తిని కూర్చుంటే... పెనిమిటి విరసమో సరసమో అర్థం కాని సకిలింపు
ఇంటికొచ్చి ఏమన్నా సాయం చేయచ్చుగా... ఎంత సేపు నీ ఇల్లే కైలాసం...పతియే పరమశివుడు... పిల్లల పంతం పట్టింపు
పండగకు పబ్బానికి వెళితే ఇంటికెళ్ళకపోతే అల్లుడు ఇబ్బంది పడడూ... అమ్మా నాన్నల హెచ్చరింపు
గడియారం ముల్లులా బొంగరంలా తిరిగే ప్రతి అమ్మాయికి అసలైన ఆఖరి ఇల్లు... ఆరడుగుల నేల లో పానుపు