నాలో నేను లేనే లేను
నాలో నేను లేనే లేను
1 min
527
నాలో ఊపిరి నీ రూపమే
నా కన్నుల వెలుగు నీ చిరునవ్వే
నా ప్రతి ఆశా నీ కోసమే
నా కలలో కూడా నిన్ను కలుసుకునేందుకు పెట్టే పరుగే
కాదనుకుని కనుమరుగు ఐపోయావు
నిన్ను చూపే అద్దం నా మనసు
ఎన్ని ముక్కలైనా అన్నిటిలో నవ్వే నువ్వే కనిపిస్తుంటే
గాజు ముక్కలు గా గుచ్చుకోవడం మానేసి
మంచు ముక్కల్లా కరిగి పోయి కన్నీళ్ళల్లా కరిగి నన్ను నీలోనే కలిసిపోమ్మని అంటున్నాయి...నాలో నా ఉనికినే చెరిపేస్తూ...నన్ను నీలా మార్చేస్తూ...