పెళ్ళి కానుక
పెళ్ళి కానుక
బోసి నవ్వులు కేరింతలు అల్లర్లు అలకలు... అన్నం తినటానికి, బడికి వెళ్ళటానికి మారాం...
నువ్వు మందలించినప్పుడు, నా గోల పడలేక నువ్వు నాలుగు వేసినప్పుడు పట్టిన పంతం... అన్నీ తీపి గుర్తులుగా దాచుకోమని అప్పజెప్పి వెళ్లిపోయే రోజున... అమ్మా...
నీ పుస్తకాల్లో పిచ్చి గీతలు గీసి
రికార్డ్ పుస్తకాలతో పూలు పడవలు చేసి ఆరపట్టించిన చిలిపితనం అంతా ఎదలో పదిలం చేసుకోమని విడవలేక విడవలేక నీ చేతిలో పెట్టేసి వెళ్ళే రోజున... అన్నయ్యా...
కాబోయే వాడికి కట్న కానుకల తోడుగా మీ కన్నీళ్ళ ముత్యాలు కాకుండా... మీ అండ అనే చిరునవ్వుల వరం తో సాగనంపుతారు కదూ...