STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

ఓ కొత్త ఉగాది

ఓ కొత్త ఉగాది

1 min
750

కళ్ళ ముందు కొత్త ఆశలు

కళ్ళ కింద నల్లటి చారలు


భ్రమలెన్నో బ్రతుకుని ఆక్రమించినప్పుడు

బదులు పలకడానికి వస్తోంది 

ఓ కొత్త ఉగాది


నేను అనే కుబుసం వీడుతోంది

పాత సంవత్సర జ్ఞాపకాలు వేపపూతలా

రేపటి ఆశలు బెల్లపు ముక్కల్లా

ఆరు రుచులు ఎన్నో భావాల్ని నింపుకుని

ఎదురు చూస్తోంది ఉగాది పచ్చడి


కన్నీటి స్నానాలు శుద్ధి చేస్తూ

కరుణ నింపుకున్న మనసు

వేలాడుతున్న వేళా పాళా లేదా అనే కొక్కెపు గొలుసు

నన్ను నేను ప్రేమించుకునే ప్రతి నిమిషమూ అమృత ఘడియే

అది ఆనందాలతో వేసుకునే బ్రహ్మముడి కదా


ఇక మిగిలింది నన్ను కలిపి నిన్ను చేయడమే

ఈ ప్రకృతితో కలిసిపోవడమే

అదే శాశ్వతం

నీలా 

నీ మనసులోని కుళ్లులా

ప్చ్

ప్రతి పండక్కి కొత్త బట్టలు కుట్టించుకోవాలనే ఆశలాగా


మళ్లీ నన్ను గిల్లుతోంది

ఓ ఉగాది



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract