మనసు
మనసు
మనం ఇద్దరం ఒక్కటే అనుకోవటం
మన స్నేహానికి హద్దు లేదని నమ్మటం
నీ సంతోషం పంచక పోయినా
నీ బాధని పంచుకునే నేస్తాన్ని నేననుకోవటం
నువ్వు అందరికోసం ఆలోచిస్తున్న
నీ కోసం ప్రతిక్షణం నేను ఆలోచించడం
అందరికి ఆనందాన్ని నువ్వు పంచుతున్న
నీ ఆనందాన్ని నేను కోరుకోవటం
నీ ఎదపై స్తానం నువ్వు ఎవరికిచ్చిన
నీ ఎదలో నాకంటూ ఒక స్తానం కావాలనుకోవటం
నీతో ఎవరున్నా లేకున్నా నీ సంతోషం కోసం
నేను ఎపుడు నీ చేయి వదలకూడదు అనుకోవటం
ప్రతి క్షణం నీ ఆలోచనలతో
నీ కోసం నీ ఆనందం కోసం నీ క్షేమం కోసం
ఆరాటపడి పొరపాటు చేసానేమో
నా ప్రేమ రాక్షస ప్రేమ గా నిను బాధ పెట్టిందేమో
ఇంకా ఇప్పటికి ఎప్పటికి నా ప్రేమ అలాగే ఉంటుంది

