చందమామకు ఒక లేఖ
చందమామకు ఒక లేఖ


అమ్మ బుజ్జగింపుతో పెట్టె పాలబువ్వకైనా
నాన్న నీకిలాంటి వాణ్ణి తెస్తానని కళ్ళల్లో నింపుకున్న కలలకైనా
బళ్ళో నేర్పే చదువులు చేర్చే గమ్యం నీ వరకే అనే ఆశలకైనా
ఆధారం నీ చల్లదనమే
కన్నెవయసులో నా ఊహల ఊసులకైనా
కోరి వచ్చిన తోడు దొరికాక కలిసి చేసుకున్న బాసలకైనా
నా జన్మకి నిండుదనాన్ని తెచ్చే కేరింతలకైనా
తోడు నీ వెలుగులే
అడుగంటిన ఆశలనీ
అడియాసలైన ఆనాటి బాసలనీ ఊసులనీ
నా కన్నీటి మేఘాలకి లంచమిస్తా
నా చూపుల ప్రేమలేఖలన్నీ నీకు చేరేదాకా
నా కనుపాపలు దాటవద్దని.