ప్రేమంటే...
ప్రేమంటే...


గుండె మాటు మాటలన్నీ చెప్పుకునేందుకు ఒక రోజు సరిపోతుందా
జన్మకి చాలని ఆత్మీయత పంచటానికి ఏడాదికి ఒక రోజు చాలు అంటే మనసు ఒప్పుకుంటుందా
కడుపులో పడ్డ క్షణం నుండి నీ కోసం కలలు కంటూ పుట్టాక ప్రతి క్షణం కంటికి రెప్పలా చూసుకున్న అమ్మ
పుట్టక ముందు నుంచి నీ భవిష్యత్తు కోసం బలాన్ని ధార పోసిన నాన్న
చదువు సంస్కారం నేర్పి మనిషిని చేసి నీ వృద్ధిని మాత్రమే కోరిన గురువులు
అమ్మ మమకారం నాన్న రక్షణ కలబోసి అందించే తోబుట్టువులు
వీళ్ళందరి ఆత్మీయతను ఒక మూటలా కట్టి మంచి చెడుల్లో తోడుండే మిత్రులు
వీళ్ళ కోసం మన జీవితంలో ఎన్ని రోజులు సరిపోతాయి
ఒక రోజుతో ఆగే బంధాలా ఒక రోజు మాత్రమే తలచుకోవటానికి
ప్రేమ ఒక రోజు ఆకర్షణ కాదు
ప్రేమ ఒక రోజు జ్ఞాపకం కాదు
ప్రేమ ఒకరితో ఒకే విధంగా ఆగిపోయేది కాదు
ప్రేమ జీవితాన్ని నావగా నడిపించే చుక్కాని
ప్రేమ ఆత్మకు ప్రాణం పోసే ఊపిరి