ఎలమి వరద
ఎలమి వరద


ప౹౹
ఎక్కడిదో ఆ అందం మనసుకే గాలం వేసింది
అక్కడినే బంధం కలపాలని మదినే చూసింది ౹2౹
చ౹౹
నిద్రలేని రాత్రులనూ తనకే అంకితం చెయాలి
భద్రమైన ప్రేమతోనే అందానికి ముడి వేయాలి ౹2౹
నిశీరాత్రులే కసీకళ్ళు నిలువునా గుచ్చేస్తున్నాయి
వశీకరణాలే వలపు తెమ్మరలో ముంచేస్తున్నాయి ౹ప౹
చ౹౹
ఏమిటో ఎలానో చేస్తున్నానే ఏమేమో తెలియక
ప్రేమతో పెరిగిన మోహము కావాలంది కలయిక ౹2౹
నింగిలోని చుక్కలు నిండిన వెలుగే యిస్తున్నాయి
పొంగిన ఎలమి చుక్కలే ఎదను వెక్కిరిస్తున్నాయి ౹ప౹
చ౹౹
ఆ నిషా కనులూ నిగ్రహా నిర్మూలనకే ఒడిగట్టాయి
తానిషా ఫర్మానాలా మరీ తనువుతో పగపట్టాయి ౹2౹
నిముషమే గంటలా గడుస్తూ గమనమే లేకున్నది
విషయమే తేలక ఎదురు చూపుల పని కాకున్నది ౹ప౹
చ౹౹
ఏ మేఘమో వచ్చి సందేశాన్ని చెలియకు చేర్చదా
ఒక రాగమైన రావించేసి అనురాగమూ కూర్చదా ౹2౹
ఎంతకాలమో ఎదురు చూడక తప్పదా ఎడదలో
అంతకాలమే ఆగలేనే ఎగసిపడే ఎలమి వరదలో ౹ప౹