కలిగించే హాయి
కలిగించే హాయి


ప౹౹
కలిగించే హాయిని కలబోసి అందించవా
వెలిగించే రేయిని వెన్నెలతోను పంచవా ౹2౹
చ౹౹
మైమరిచిన మనసుకే సౌఖ్యం కూర్చనీ
ఎద చరిచిన సొగసుకే ఎలమినే చేర్చనీ ౹2౹
మనసైన మగువను మరులతో ఎదగనీ
వరసైన సరసము వాటంగానూ కదలనీ ౹ప౹
చ౹౹
ఆశలెన్నో హారతిపట్టి ఆదరించే ప్రేమలో
ఊసులెన్నో ఊకొట్టి ఊరించే జాములో ౹2౹
కలలోకి వచ్చి కల్పనలెన్నో కల్పించేవూ
ఇలలోకి తెచ్చి ఊహలన్నీ తరలించేవూ ౹ప౹
చ౹౹
కోరికేమో కొండలా పెరిగి కొరికేస్తుంటేను
ఊరికేమో ఉండకా ఉక్కిరి బిక్కిరంటేను ౹2౹
చూసావా జలపాతమైనే వలపు పాతమే
వేచాకాఎదగిల్లి నిలిపేది తలపు ఊతమే ౹ప౹