సారీ నాన్న
సారీ నాన్న
వేలు పట్టి అడుగులు నేర్పిన నాన్నకి దూరంగా పరుగులు పెట్టాలనుకున్నా...
ముద్దుగా పలుకులు నేర్పిన నాన్నకి మాటలు చేత కావట్లేదు అని ఆయనతో ముక్తసరిగా మాట్లాడటం అలవాటు చేసుకున్నా
ఆయన ప్రతి ఆలోచన నా కోసమే అని తెలిసినా ఒక మాట అనేసరికి ఆయన తలపే చేదు అనుకున్నా
నా పంతంతో పలకకుండా ఏదో సాధించా అనుకున్నా
నేను కళ్ళు తెరిచేసరికి ఆయన కన్ను మూసారు
నేనే మెట్టు దిగాలి అనుకునేసరికి ఆయన అందనంత దూరం అయిపోయారు
ఎంతో చదువుకున్నా అనుకున్న నేను మా నాన్న మనసు చదవలేకపోయాను
నా జీవితంలో నన్ను నేను క్షమించుకోలేని ఓటమి
మా నాన్నని దూరం చేసుకోవడం