మేము కూడా బాలలమే!
మేము కూడా బాలలమే!


పాత దుస్తులమా?
శాపగ్రస్తులమా?
ఆకలి పస్తులమా?
పెంట వస్తువులమా?
మేము కూడా బాలలమే
కనికరిస్తే భావి పౌరులమే
అంటరానితనమా?
నిత్య వ్యాకులమా?
బ్రతుకు అతలకుతలమా?
ఇది పూర్వ ఫలమా?
మేము కూడా బాలలమే
చదివిస్తే ప్రయోజకులమే
కూటికి బానిసలమా?
లేమికి బందువులమా?
కళల కలలమా?
కవుల కలములమా?
మేము కూడా బాలలమే
ఊతనిస్తే విభ్రాంతిపరచువారమే
మాక్కూడా జాతీయగీతం జనగణమనే
మాక్కూడా దేశ రాజధాని ఢిల్లీనే
మాక్కూడా జాతి పిత గాంధీనే
మాక్కూడా చాచాజీ నెహ్రూనే
మాక్కూడా కర్మ భూమి, ధర్మ భూమి, వేద భూమి ఈ పుణ్యదేశమే
మాక్కూడా ఈ వేళకాని వేళ అర్ధాకలి గోల నడుమ బాలల దినోత్త్సవమే