కల(ళ)ల ప్రపంచం
కల(ళ)ల ప్రపంచం
శుద్ధమిశ్రణము నేటి బడి
ఎక్కిస్తుందా నీ బుర్ర వేడి
సరస్వతీ అమ్మగారి ఒడి
పీల్చేస్తుందా నీ కళల తడి
నాన్నగారి కలల అంచుగడి
మార్చునా నీ స్వప్న మొక్కుబడి
ఏంది ఈ చుట్టాల హడావుడి
నీ వాంఛల్నరికి వారి అంగడి
అటులనెందరో వచ్చు పనిపడి
నీ ప్రతిభకు అడ్డుపడి
ఐనా కళను చంపకు భయపడి
ఆకలికి దాసోహపడి
తడబడినా పొరబడి
ప్రయత్నించు ఎగసిపడి
అల్పమైనా చేరనీకు అగబడి
పోరాడు చేరువరకు గెలుపు గడి