రామా...
రామా...

1 min

34.5K
ఏది ప్రసిద్ధమేది ప్రగతి
ఎటు పోతున్నది నా ఈ జగతి
ఏది న్యాయమేది నీతి
దారులు సడలినది మానవజాతి
ఏది సర్వమేది కీర్తి
కావాలొక ఆదర్శమూర్తి
ఏది భక్తేది ముక్తి
తేవాలొక గొప్ప స్ఫూర్తి
ఏది వ్యక్తిత్వమేది శక్తి
రావాలొక శ్రీరామమూర్తి
మంచి పుస్తకము వంద
గొప్ప వ్యక్తిత్వాలకు సమము
మహా వ్యక్తిత్వము లక్ష
మంచి పుస్తకాల సమూహము
రామచంద్రుని అధికరించు
వ్యక్తిత్వమున్నదా
రామాయణమునకు మించు
వ్యక్తిత్వ వికాస గ్రంధమున్నదా
రాముడు కాడు మాధవుడు
అసలిసిసలైన మానవుడు
యోగ్యమైన పాలకుడు
పృథగ్భూతత్వమున ఉన్నతుడు