నేనే నా దేశాన్ని
నేనే నా దేశాన్ని


నేనొక బాలికని
చూపకు తారతమ్యముని
చదివించి చూడు నా ప్రతిభని
అవుతా నరలోక నాయకిని
నేనొక స్త్రీని
వెన్న మనసు కలిగితిని
యేమార్చకు కరిగితినని
మరువకు నా క్రౌర్యముని
నేనొక నారిని
సుకుమారిని
చూపిస్తా జాలిని
కోపాన కాళిని
నేనొక ఆలిని
తలవంచినానని
అనుకోకు బానిసనని
మారేద రుద్రాకృత మాలిని
వంటా వార్పూ చేసితినని
ప్రేమతో ఆకు పరచితినని
అలసిన చేతితో
మెత్తని మనసుతో
కూడును వడ్డించానని
నీ ఎంగిలి పంచుకుంటినని
చిన్న చూపు చూడమాకు
చేప్పిందల్లా చేస్తినని
అడిగిందల్లా వండితినని
వంటింటి డమ్మీననుకోకు
జీవితమంతా నీకే
వండుకుంటూ ఉండే
నీ మమ్మీననుకోకు
నీకుమల్లే
వేషం లాసం
దేశం రోషం
నాకూ చుట్టాలే
ప్రసవాన్ని గెలిచే వరుకు
పోరాడే యోధురాల్ని
ఈపొద్దే రంగాన్నైనా
నేనే నా దేశాన్ని
నీ మనసునిండా
తప్పు నిండి ఉంటే
నీకు చూసేదంతా
తప్పుగా అనిపిస్తుంటే
నీవేమో నన్ను
తప్పుడు భావంతో చూస్తూ
నావల్లే లోకం చెడినాదంటూ
నా వల్లే యుద్ధాలన్ని జరిగాయంటూ
నాపైనే నిందలు మోపుతావా
మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా
ఒకే మనసుతో ఆదరించే
భూమాతకు పొలిఉన్నా
ఓపిక నాకే సొంతమురా
ఆకాశం నా ప్రేమ ఏరిగినావేమో
నాలోని తల్లి ప్రేమ చూసినావేమో
నా కోపం ఎన్నడూ తవ్వమాకురా
సూర్యుడ్ని గుండెలోన దాచినానురా
తెగువైన మగువను
మరువకురా
మగువంటే తెగువని
యాదుంచుకోరా