భారతజాతి నాయకుడు
భారతజాతి నాయకుడు
(కవిత )
కల్లబొల్లి కబుర్లిక వద్దన్నాడు
కణకణ నిప్పులు కురిపించాడు
రుధిర జ్వాలలు మండించాడు
సాధికారత కోరి పోరాడినాడు
భరత జాతికి నాయకుడైనాడు
అహింసోద్యమమింక నలుసన్నాడు
ఆజాదు హిందు పౌజును స్థాపించాడు
సర్వసైన్యాధ్యక్షుడై విజృంభించాడు
దొరలను గడగడ లాడించాడు
చురుకుగా ప్రభుత్వాన్ని నడిపాడు
"రక్తాన్ని చిందించి సమరంలో దూకుదాం!
శక్తిని చూపించి స్వాతంత్ర్యాన్ని తెద్దాం!
శంఖాన్ని పూరించి చీల్చి చెండాడుదాం!
సంకటాలెదిరించి సాహసం చేద్దాం!"
అని పల్కి ఆ గగనాన్ని చేరాడు.
కనుపించకుండా కనుమరుగైనాడు
భరత జాతికి స్ఫూర్తి నింపినాడు.
నేతాజీగా ప్రజాహృదయాల వెల్గినాడు
మరణం లేనట్టి మహనీయుడైనాడు
సుభాస్చంద్ర బోస్ అనే సాహసికుడు.//
