STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

కలము - బలము

కలము - బలము

1 min
2

(తేటగీతి.)

కలము గొప్పది పదునైన కత్తికంటె 
కలము పట్టిన వానికి కలుగు కీర్తి 
కలము చూపును జగతికి వెలుగు దారి 
కవులు జాతిని నడపించు ఘనులు సుమ్మి.//

గన్ను రక్తమున్ జిందించి క్రౌర్య గతిని 
ప్రాణముల్ తీసి పెంచును వైరమకట!
కలము బలమును పెంచుచు గెలుచు ధరణి 
కవులు ద్రష్టలై రచయింత్రు గ్రంథములను.//


Rate this content
Log in

Similar telugu poem from Classics