చందమామ
చందమామ
కలువల రేడతడు కమలములకు కాడు
కవులకూ చిత్రకారులకు ప్రేరకమ్మతడు
దర్పము సూపడు దర్పణముందు ఇముడుతాడు
దశరధాత్మజుడు సూర్యవంశజుని నామమందు నిలిచినాడు
అందనివాడైనా అందరికీ మామేయతండూ
అమ్మలకందరికీ అవ్యక్త సోదరుండు
అవని అంతటికీ అతనొక్కడే అంధకారమున బంధువు
యుగమేదైనా ప్రాంతమెక్కడున్నా తానొక్కడై వెలుగు వాడూ
గగనమునందే నివాసమున్నా ప్రతి చల్లని
హృదయమునందూ బింబిస్తాడూ
గ్రంధమీలెన్నో తనపై వ్రాసినా ఇంకా ఎంతో
మిగిలేవుండును విశేషములెన్నో