అక్షరం
అక్షరం


అక్షరం అక్షయం సువ్యక్తమైతే సుఖాంతం
లక్షలకన్నా లక్షణమైనది లక్ష్మీ సైతం మెచ్చినది
అనంతం ఆవిష్కరించును అంతరంగం
అన్నిటికన్నా అధికమైనది ఐనా అణకువ నిండినది
తరారతాలకు వారిని తరగని పెన్నిధి
తీయనివైనా తిట్లే అయినా తీరు మాత్రం సున్నితం
చోరము కానిది చారగుణం లేనిది
చిగురించినది స్పృశించిన మాత్రాన
చీకటి చీల్చే ఆయుధం వీడకు జీవితాంతం