STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

ఆశయాల వారధి

ఆశయాల వారధి

1 min
1

ఆశయాల వారధి 
(వచన కవిత )
*********************
రూసీ దేశముతో స్నేహము రోజు రోజుకూ పటిష్ఠం.
ఆశయాల వారధిగా దీనినభివర్ణించుకొందాం!

ద్వైపాక్షిక సంబంధాలతో దగ్గరవుతాయి రాజ్యాలు.
వ్యాపార, రక్షణ రంగవొప్పందాలు ప్రగతికే సోపానాలు.

బలమైన సఖ్యతతోడ వర్థిల్లుచుండు నిరుదేశాలు.
కలిసి మెలసి పయనిస్తే కలుగును సౌభాగ్యాలు.

దేశమైనా రాష్ట్రమైనా కావాలి స్థిరమైన ప్రభుత్వం.
ఆశపెట్టుకున్న ప్రజల కానందాన్ని పంచటమే లక్ష్యం.

శాంతిని కాంక్షించే నాయకుల సమర్థతకిదే సాక్ష్యం.
క్రాంతి పథములో జగతిలో ప్రజలెల్ల పయనించటం.

నేడు జయమంచు నిలబడు మన సార్వభౌమాధికారం.
వేడుకగా నిరుదేశాల మైత్రి వృద్ధిచెందితే సంతోషం.//


Rate this content
Log in

Similar telugu poem from Classics