STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

ప్రకృతిని చూడు!

ప్రకృతిని చూడు!

1 min
12

ప్రకృతిని చూడు!
( వచన కవిత )

బాధలేని దెవరికి? ప్రాణులకు సహజమే!
శోధనము లేలరా? చూడుమా జగతినే!

చెట్టుపుట్టలు లేక చింతపడు జీవులను 
కట్టుకోవగగూడు కరవైన పక్షులను 

ప్లాస్టిక్కు చెరలోన పడియున్న జీవములు
కాపాడు రారెవరు!కరుణించు వారేరి?

కాలుష్యమను భయంకరమైన భూతమును
బలుపుతో పెంచుకొను పామరులమే మనము.

సృష్టిలో జన్మించి చూపులేని యంధులు.
కష్టముగ బ్రతుకుచూ కాళ్ళులేని జనులు.

పూటగడవగ నింత భోజనము దొరకక
పాట్లు పడుచుండగా బాధలకు సెలవేది?

పుడమిలో నెందరో భోరుమని విలపించ
నడయాడుచుందుమా నరకమును చూడక!

కరుణతో మనమెల్ల కదలి వచ్చిన చాలు!
ధరకు శుభమగుభావి తరములే వర్థిల్లు.//


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics