STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

నాడు - నేడు

నాడు - నేడు

1 min
14

నాడు- నేడు.
( వచన కవిత )

నాడు విద్యాభ్యాసంబన విశ్వాసమున్న జనులు.
నేడు విపణిలో విద్యకయి గొనుగోళ్లు చేయు ప్రజలు.

నాడు ప్రేమతో గురువులు సల్ప విద్యా బోధనము.
నేడు ఉపాధ్యాయులకు వచ్చెనయ్యో వెఱ్ఱి భయము!

నాడు దేశాన విలసిల్లె ప్రభుత్వపు పాఠశాలలు.
నేడు ప్రతిచోట ప్రయివేటు పరమైన విద్యాలయాలు.

విలువలన్నవి నేర్పని ఉపాధ్యాయులు చేయగా వృత్తి.
నిలకడసలే లేని ఛాత్రుల బుర్రల్లో మర్కటపు ప్రవృత్తి.

ర్యాంకుల గొడవలో నధికమైన ఆందోళనలు.
అంకెల గారడీలో నయోమయమైన యువత తపనలు.

లక్షల్లో ఫీజులుకట్టినా రాలిపోయెడి పసి బ్రతుకులు.
శిక్షననుభవించుచు గడుపు పెద్దవాళ్ళ జీవితాలు.

నేటి విద్యావ్యవస్థ యొక నీట మునిగిన నావ!
చేటు కల్గుచుండునీ జాతి తన యునికి కోల్పోవ!

గురుకులముల కాలమే గొప్పగా కనిపించు!
ధరణికే బోధించు మన పూర్వచరిత్రను గురుతించు!

మార్చుకొందాములే మన కుహనా విధివిధానాలు.
తీర్చిదిద్దుకుందాము మన దిషణతో స్థితి గతులు.

***********************


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics